MNCL : పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

గ్రామీణ స్థాయి నుంచి సంక్షేమాఖివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోకళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బృహత్‌ పల్లెప్రకృతి వనం కార్యక్రమ పెండింగ్‌ పనులను 15 రోజులలో పూర్తి చేయాలని, మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని, పల్లెప్రకృతి వనం లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. మండలాల వారిగా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, మొక్కల సంబంధిత ఫొటోలను రెండు రోజులలో అందించాలని, నిర్వహణ సక్రమంగా లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధివోమీ పథకం క్రింద గ్రామపంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులలో ప్రతి గ్రామపంచాయతీలో 200 మంది కూలీలకు తక్కువ కాకుండా సోమవారం నుండి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమ లక్ష్యాలను అధికారుల సమన్వయంతో అధిగమించడం జరిగిందని, ఈ సంవత్సరం నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాలలో రోడ్డు, నివాస ప్రాంతాలు, కూడళ్లు అంతా పరిశు[భంగా ఉంచాలని, మురుగు కాలువల పూడిక ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలని, పారిశుద్ధ్యంపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై పర్యవేక్షించాలని, వాటిని వినియోగించేలా చూడాలని, సెగ్రిగేషన్‌ షెడ్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమ అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post