MNCL : పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను జూన్‌ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏ.సి.సి., న్యూగర్శిళ్ళ ప్రాంతాలలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లాలోని నస్పూర్‌ మండలం తీగల్‌పవాడ్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలు, ఆర్‌కె-6 కాలనీ, సీతారాంపల్లి, నస్పూర్‌ లలోని ప్రాథమిక పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పలు సూచనలు, సలహాలు చేస్తూ మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో అవసరమైన వసతులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఈ. శ్రీనివాస్‌, ఏ. ఈ.లు స్వామి, అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post