MNCL : పాఠశాలల పున:ప్రారంభ సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

విద్యార్థినీ, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఏకాగతతో విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేయబడిన పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి తరగతులు పునఃప్రారంభించే సమయానికి చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి రాజస్వ మండల అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి, ముఖ్య ప్రణాళిక, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో జూన్‌ మాసంలో తరగతులు ప్రారంభ సమయానికి పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేయాలని తెలిపారు. తరగతుల విస్తీర్దాన్ని బట్టి ఫ్యాన్లు, పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న తరగతులను కూల్చివేసిన ప్రదేశంలో నూతన గదుల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు, విద్యుచ్చక్తి, భోజనశాల, తరగతి గదుల నిర్మాణాలకు అందించిన ప్రతిపాదనలలో అవసరం మేరకు మాత్రమే అంచనాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలల ఆవరణ మైదానాలను దాతల ద్వారా, పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీల ద్వారా పనులు చేపట్టాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని, యు-డైస్‌లో ఉన్న పనులను ప్రణాళికబద్దంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ముఖ్య ప్రణాళిక అధికారి కృష్ణయ్య, పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ప్రకాష్‌ జాదవ్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post