MNCL : పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం దొనబండ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న 5వ విడత పల్లైప్రగతి కార్యక్రమ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, రోడ్డు, మురుగుకాలువలు ఎక్కడా కూడా చెత్త కనిపించకుండా, పంచాయతీ సిబ్బంది నిత్యం ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్జుకు తరలించడంతో పాటు కంపోస్ట్‌ షెడ్ల ద్వారా చెత్తను ఆదాయ వనరుగా మార్చడంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి సంరక్షించాలని, గ్రామపంచాయతీ పరిధిలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో ఎంపికైన దొనబండ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పాఠశాలల ప్రారంభంలోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ప్రధాన రహదారి నుండి వ్యవసాయ క్షేత్రం వరకు నిర్ణయించి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద పూర్తి చేసిన రహదారి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారి చే జారీ చేయడమైనది.

Share This Post