MNCL : పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రజల సౌకర్యార్థం ప్రతి పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల, మాంసపు మార్కెట్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌తో కలిసి మున్సిపల్‌ కమీషనర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మున్సిపల్‌ పరిధిలో 7 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల, మాంసపు మార్కెట్‌ నిర్మాణాలలో భాగంగా జిల్లాలోని 7 పురపాలక సంఘాల పరిధిలో నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలోని ఆర్‌ & బి అతిథి గృహం అవరణలో, లక్షెట్టిపేట పరిధిలో పాత తహశిల్దార్‌, పాత పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో, నస్పూర్‌ పరిధిలో సుందరయ్య కాలనీలో గల రాయల్‌ టాకీస్‌ సమీపంలో, చెన్నూర్‌ పరిధిలో పాత తహశిల్దార్‌ కార్యాలయ సమీపంలో, క్యాతన్‌పల్లి పరిధిలో ఆదివారం వారసంత ప్రాంతంలో, మందమర్రి పరిధిలో న్యూ రామన్‌కాలనీ వంతెన సమీపంలో, బెల్లంపల్లి పరిధిలో కాంటా ఏరియా /పాత మార్కెట్‌ ఏరియాలో సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు కూరగాయలు, మాంసం ఉత్పత్తులు ఒకే లభించాలనే ఉద్దేశ్యంతో ఫ్లాట్‌ఫామ్‌లతో పాటు సామాగ్రి నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌ స్టేరేజ్‌ పాయింట్‌ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్యశాఖ ఈ. ఈ., ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ, గుత్తేదారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మున్సిపల్‌ పరిధిలో వైకుంఠధామలు (శ్మశానవాటిక) ఏర్పాటుకు స్ధూలు గుర్తించడం పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలోని ఆండాళమ్మ కాలనీ, రాజీవ్‌ ప్రాంతాలలో, లక్షైట్టిపేట పరిధిలోని గోదావరి నది సమీపంలో గల ఇటిక్యాల సమ్మక్క గద్దె ప్రాంతంలో, నస్పూర్‌ పరిధిలో తాళ్ళపల్లి వద్ద గల గోదావరి నది సమీపంలో, తహశిల్దార్‌ కార్యాలయ సమీపంలో, బెల్లంపల్లి పరిధిలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం, రడగంబాల బస్తీ ప్రాంతాలలో, చెన్నూర్‌ పరిధిలో గోదావరి పుష్కర్‌ఘాట్‌ ప్రాంతంలో, క్యాతన్‌పల్లి పరిధిలో అమరవాది ప్రాంతంలో, మందమర్రి మున్సిపల్‌ పరిధిలో స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలోని ఆండాళమ్మకాలనీలో 2 కోట్ల రూపాయలు, మందమర్రి పరిధిలో 2 కోట్ల 25 లక్షల రూపాయలు, మిగతా ప్రాంతాలలో 1 కోటి రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌, లక్షైట్టిపేట, చెన్నూర్‌ ప్రాంతాలలో తలెత్తిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్యాతనపల్లి, చెన్నూర్‌ మున్సిపాలిటీల పరిధిలో ఫీకల్‌ స్లడ్డ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు చేపట్టి కొనసాగుతున్నామని, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో పనులను ప్రారంభించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల కమీషనర్లు, ప్రజా ఆరోగ్యశాఖ ఈ. ఈ.లు, డి.ఈ.లు, ఎ.ఈ. ఈ.లు, ఇంజనీరింగ్‌
విభాగాల అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post