MNCL : పూలనే దేవతగా పూజించే వేడుక “బతుకమ్మ పండుగ” : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రకృతిలో లభించే పూలతో దేవతను చేసి పూజించే వేడుక “బతుకమ్మ పండుగ” అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా గురువారం అట్ల బతుకమ్మను పురస్కరించుకొని రెవెన్యూ, కలెక్టరేట్‌ ఉద్యోగులతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన ఆవరణలో, అనంతరం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. నిత్యం తలమునకలయ్యే పనులలో నిమగ్నులై ఉందే రెవెన్యూ శాఖ, కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు వేడుకలలో ఆట-పాటలతో సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని, నూతన వస్త్రాలు ధరించి, సేకరించిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు. మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ పండుగ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, కలెక్టరేట్‌ కార్యాలయ మహిళా ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post