MNCL : పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

జిల్లాలోని అసెంబ్లీ 3 నియోజకవర్షాల పరిధిలో చేపట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి గుగ్గిళ్ళ సత్యంతో కలిసి అభివృద్ధి వనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కన్‌స్టిట్యూషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (సి.డి.పి.), కృషియల్‌ బాలన్స్‌ ఫండ్‌ (సి.బి.ఎఫ్‌.), కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సి.ఎస్‌. ఆర్‌.), మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఎం.పి. ల్యాడ్స్‌) పథకం, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌.డి.ఎఫ్‌.), డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (డి.ఎమ్‌.ఎఫ్‌.టి.) నిధుల కింద మంజూరు చేసిన పనులలో 2017-18 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పూర్తి చేసిన పనులకు బిల్లులు, వినియోగిత ధృవీకరణ చేసి వెంటనే పంపించాలని, అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక అందించాలని తెలిపారు. అభివృద్ధి పనుల పట్ల బాధ్యతయుతంగా ప్రవర్తించాలని, పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. డి.ఎమ్‌.ఎఫ్‌.టి. నిదుల కింద మంజూరు చేసిన పనులపై స్టేట్‌ పి.ఎమ్‌.యు. కన్సల్టెంట్‌, పి. ఎమ్‌.కె.కె.క.వై. / ఊఎమ్‌ువీఫ్‌. మినిప్టీ ఆఫ్‌ మైన్స్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి మడిపల్లి పద్మావతి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ఏజన్సీలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post