ప్రతి పండుగను ప్రజలందరు ఆనందంగా జరుపుకోవాలని, నిరుపేదలు నిరుత్సాహ వడుకుండా సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇష్తార్ విందు కార్యక్రమానికి డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ ఉపవాసాన్ని వేసవి కాలం అయినప్పటికీ ఎండ వేడిమిని తట్టుకొని నిష్టతో కఠినంగా పాటిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ పండుగ రోజున ప్రజలు నూతన వస్త్రాలు ధరించి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నియోజకవర్గంలోని 2వేల మందికి వస్త్రాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.