ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రేశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, వైద్య విద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్ణాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లాలోని లక్షైట్టిపేటలో వ కోట్ల 50 లక్షల రూపాయలతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని, మంచిర్యాలలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నాలుగు దశాబ్దాల మంచిర్యాల జిల్లా ఏర్పాటు కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని, దేశంలో ప్రతి 1 లక్ష జనాభాకు 19 ఎం.బి.బి.ఎస్. సీట్లతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా మొదటి విడతలో మంచిర్యాలకు కళాశాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేసుకుందామని, వైద్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 9వ స్థానంలో ఉందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం కళ్యాణలక్ష్మీ, ఆరోగ్యలక్ష్మీ, కె.సి.ఆర్. కిట్లు, ఆసరా పెన్షన్ పథకాలు అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో గర్భిణీ ప్రీల కొరకు శ్రీరామనవమి పండుగ తరువాత న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు కడుపు నిండా భోజనం చేయలనే ఉద్దేశ్యంతో ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని, 200 రూపాయల
ఉన్నఫించన్‌ను 2 వేల 16 రూపాయలకు పెంచడం జరిగిందని, ఆడపిల్ల పెళ్ళి కోసం 1 లక్ష రూపాయలు అందిస్తున్నామని, గర్భిణీ ప్తీలకు ప్రసవం తరువాత కె.సి.ఆర్. కిట్, 18 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, నూతనంగా న్యూట్రిషన్ కిట్ అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గృహలక్ష్మీ పథకం ద్వారా పేదలు తమ సొంత నివాస స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గాను 3 లక్షల రూపాయలు నగదుగా అర్హులైన మహిళల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి రాష్ట్రంలో 56 లక్షల ఎకరాలలో పండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు లాభం చేకూర్చడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యుల ప్రతిపాదన మేరకు జిల్లాలోని రైతులకు ఉపయోగకరంగా లక్షైట్టిపేటలోని గూడెం ఎత్తిపోతల పథకంకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుకు
కృషి చేస్తామని, లక్షైట్టిపేటలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని 6 నెలల లోగా పూర్తి చేసి అవసరమైన వైద్యాధికారులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని, బస్తీ దవాఖాన మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.