MNCL : ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, పట్టణాలలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం, జి.ఓ. నం.58, 59, 76, 118ల ప్రక్రియ, పోడు భూములు, తెలంగాణకు హరితహారం, వేసవి జాగ్రత్తలు, ఇంటర్మీడియట్‌, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయం అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాఖివృద్ధి పథకాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 86.5 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 14.23 లక్షల మందికి రీడింగ్‌ కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగిందని, 10.37 లక్షల మందికి ‘పిస్కిష్పన్‌ కళ్ళద్దాలను ఆర్టర్‌ చేయగా, జిల్లాలకు 5 లక్షలకు పైగా ప్రిస్కిష్పన్‌ కళ్ళద్దాలు అందజేయడం జరిగిందని, వీటిని త్వరితగతిన లబ్బిదారులకు వారి ఇంటి వద్ద
అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళ ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళ కేంద్రాలపై ప్రజలలో విసృత ప్రచారం నిర్వహించాలని, రిఫరల్‌ ఆసుపత్రిలో వసతులు కల్పించడం జరుగుతుందని, చికిత్స అవసరం ఉన్న మహిళలకు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 ప్రక్రియ పకదృంధీగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్‌ పట్టాలను మార్చి చివరి
నాటికి పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ రుసుము వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు 76కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రుసుంను వసూలు చేసి పట్టాల పంపిణీ మాసాంతానికి పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కొరకు సేకరించి 1 వేయి 39 ఎకరాల భూమి ఉoదని, సంబంధిత భూమి స్కెచ్‌, ఇంటి పట్టాల వారిగా సరిహద్దులు, నిర్మాణానికి అనుకూలత వంటి అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్ల లబ్దిదారుల కేటాయింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా
22 వేల 322 ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్‌లైన్‌ లో నమోదు చేశామని, మరో 9 వేల 411 మంది లబ్దిదారుల ఎంపిక ఏప్రిల్‌ మొదటి వారం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభం అవుతుందని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, రానున్న వేసవి దృష్టా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో,
బహుళ అంతస్తులు, షాపింగ్‌ మాల్స్‌లలో అగ్నిప్రమాద నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించవద్దని, జిల్లాలో ఫైర్‌ సేఫ్టీ కోసం ఆడిట్‌ నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించుకున్న సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయాలలో మార్చి మాసాంతం నాటికి ప్రైవేట్‌ భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేసి తరలించాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైకుం
ధామం నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలి, వైకుంఠదామాలో విద్యుత్‌, నీటి సరఫరా సౌకర్యాల ఏర్పాట్లు పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలకు నిర్దేశించిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల లక్ష్యాలు పూర్తి చేయాలని, రానున్న వేసవి దృష్టా మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో (గ్రామ పంచాయతీలలో వచ్చిన ఆడిట్‌ అభ్యంతరాల పరిష్కారం జరిగేలా కృషి చేయాలని, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల
ప్రక్రియ త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 18వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు పకద్భందీ ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, 6 పేపర్లు పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గం॥ల నుంచి మధ్యాహ్నం 12.30 గం॥ల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని, కాంపోజిట్‌ సైన్స్‌ పరీక్ష మాత్రం 9.30 గం॥ల నుంచి 12.50 గం॥ల వరకు ఉంటుందని, ప్రశ్న పత్రాల రవాణా, వాటి స్టోరెజ్‌, పరీక్షా కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని, నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, రాబోయే 3 నెలలు మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ జిల్లాలో జీ.ఓ. 76 క్రింద పెండింగ్‌లో ఉన్న 3 వేల 554 దరఖాస్తులలో అర్హులైన 1 వేయి 79 లబ్టిదారులకు ఈ నెలాఖరు వరకు పట్టాలు అందజేయడం జరుగుతుందని, మిగతా 2 వేల 275 దరఖాస్తులలో అర్హులను గుర్తించి ఏప్రిల్‌ 1 మొదటి వారంలో అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము దాదాపు 3 కోట్ల రూపాయలు బకాయి ఉందని, 15 రోజులలో ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. పల్లెప్రకృతి వనాలలో మొక్కలకు నీరు అందించేందుకు గాను 155 చేతిపంపుల కొరకు డ్రిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్‌ నాయక్‌, బి.రాహుల్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌, ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post