ప్రజా సంక్షేమం దృష్టా ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల నిర్ధేశిత లక్ష్యాలను త్వరగా పూర్తి జేషీ విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, గ్రామీణాభివృద్ధి, వైద్య-ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, మున్సిపల్ కమీషనర్లు, హౌజింగ్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు, నివాస స్థలాలు ప్రొఫార్మా-1, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల ఇండ్లు, జి.ఓ. నం.58, 59, 76, 118 అమలు, పోడు భూములు, ఆయిల్ పామ్, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సరైన పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది, గ్రామకంఠం, శిఖం, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను ప్రొఫార్మా-1 ప్రకారం సేకరించడం జరిగిందని, ఈ క్రమంలో సదరు భూముల క్రమబద్దీకరణ చేసేందుకు గల అవకాశం, ప్రాతిపదిక, అనుసరించాల్సిన విధానంపై నివేదిక రూపొందించాలని, జి.ఓ. నం. 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం, ఆబాది మొదలగు కారణాల వల్ల హోల్ట్‌లో ఉంచి దరఖాస్తులను పున;పరిశీలించాలని, ప్రొఫార్మా-1 ప్రకారం సేకరించిన సమాచారం, సదరు దరఖాస్తులను సరిచూసి పూర్తి స్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, జిల్లాలకు చేరే ప్రిస్కిష్నన్ కళ్ళద్దాల పంపిణీ పూర్తి చేసి వివరాలను ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ బృందాలు విసృతంగా కంటి వెలుగు శిబిరాలను పర్యటించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వేసవి దృష్టా క్యాంపుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో జి. హెచ్.ఎం.సి. మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి కాబడిన రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ ప్రక్రియలో 21 వేల 787 లబ్ధిదారులను ఎంపిక చేయవలసి ఉ ౦దని, ఈ దిశగా జిల్లా కలెక్టర్‌లు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన లబ్బిదారులను ఎంపిక చేసి వివరాలను 10 రోజులలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తులకు సంబంధించి పట్టా సర్టిఫికెట్లను సిద్దం చేయడం జరిగిందని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకొని వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని, అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, రుసుము మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు సేకరించి పట్టాల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. జి.ఓ. నం. 76 క్రింద అధికారులు పెండింగ్ దరఖాస్తుల పరిశీలన 3 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరితగతిన రుసుము వసూలు చేసి మార్చి 20 నాటికి పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. పోడు భూముల పంపిణీకి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను ఒకసారి సరి చూసుకొని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ చేయాలని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు క్రింద నిర్ధేశించిన లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని, సంబంధిత భూముల డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే సీజన్‌లో నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీలో సిద్దం చేసేలా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 40 శిబిరాలు ఏర్పాటు
చేసి ప్రజలకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పోడుభూముల పట్టాల ప్రక్రియలో నియమించిన ఎఫ్.ఆర్.సి. కమిటీ సమన్వయంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తున్నామని, రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలోని తి నియోజకవర్గాల పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయని, అర్హులైన లబ్బిదారుల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి.రాహుల్, అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.