ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి సరైన చికిత్స ద్వారా నివారించుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ వ్యాధి పరీక్ష కేంద్రాన్ని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలలో సాధారణంగా వచ్చే అవకాశం ఉన్న గర్భసంచి, రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి తగు చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవ్చని తెలిపారు. చాలా మందిలో అవగాహన లేమి ఉంటుందని, ఒకవేళ అవగాహన ఉన్న బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ డిటెన్షన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేసుకోవాలని, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స పొందినట్లయితే సమస్య తీవ్రతరం కాకుండా (ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. 9 నుండి 30 సం॥ల వయస్సు ఉన్న వారు ఖచ్చితంగా క్యాన్సర్ నిరోధక టీకా తీసుకోవాలని, 30 నుండి 60 సం॥ల వయస్సు గల వారు ప్రతి 5 సం॥లకు ఒకసారి పరీక్ష చేయించుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుచున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీహర్న కళాశాలలో పరీక్షలు జరుగుచున్న తీరును పరిశీలించారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వేసవి కాలం కావడంతో ఓ.ఆర్.ఎస్. ఇతరత్రా మౌళిక సదుపాయాలు కల్పించాలని కళాశాల యాజమాన్యం, నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.