బాలల సంరక్షణ, సంక్షేమం కోసం ఆపరేషన్ స్మైల్ సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జిల్లా సంక్షేమ అధికారిణి ఉమాదేవి, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వాహిద్తో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమం, ఆపరేషన్ స్మైల్ అమలు తదితర అంశాలపై సంబంధీత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీ, కార్మిక, పోలీసు శాఖలు, పలు స్వచ్చంద సంస్థలు సమన్వయంతో జిల్లాలో మూడు డివిజన్ల ద్వారా మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లిలలో బాలకార్మికులు, వీధి బాలలు, భిక్షాటన చేయు పిల్లలను గుర్తించి వారి సంక్షేమం కోసం ఆపరేషన్ ముస్మాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా పని చేయడం జరుగుతుందని తెలిపారు. గొర్రెల కాపరులు, సిరామిక్స్ ప్రదేశాలలోనే కాకుండా ఇటుక బట్టీల వద్ద వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వారి పిల్లల కోసం పని ప్రదేశంలో తాత్కాలిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని, 16 సంవత్సరాల పైబడిన పిల్లలకు సంబంధించి ఒకేషనల్ టైనింగ్, పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా దీన్ దయాల్ కౌశిక్ యోజన, న్యాక్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఆసక్తి గల బాలలకు తగు శిక్షణ, ఐ.టి.ఐ. అడ్మిషన్స్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, కార్మిక శాఖ,
సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.