MNCL : భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్‌ ష్లాన్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో 5 మున్సిపాలిటీల కమీషనర్లు, చైర్‌పర్సన్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన పురపాలక చట్టం ప్రకారం పట్టణాలలో ప్రణాళికబద్దంగా పట్టణాభివృద్ధికి పనులు చేపట్టాలని, జిల్లాలోని ర్‌ మున్సిపాలిటీలకు 20 సంవత్సరాలకు కార్యచరణ రూపొందించాలని, వచ్చే వారం ఎన్‌.ఐ.ఎ. బృందం క్షేత స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులు ప్రక్రియ త్వరగా పూర్తి చేసి సోమవారం లోగా అందించాలని ఆదేశించారు. పట్టణ జనాభా, వాటర్‌, టవర్‌ ఇతరత్రా సంబంధిత శాఖల అధికారులు ముందు చూపుతో ప్రతిపాదనలు తయారు చేసి అందించాలని తెలిపారు. 2018 తరువాత ఇలాంటి అవకాశం రాలేదని, ప్రజలకు భవిష్యత్‌ ఉపయోగకరంగా ప్లాన్‌ తయారు చేయాలని, గ్రామాలలో అన్ని శాఖలకు సంబంధించి అధికారులను సమన్వయం చేసుకొని మాస్టర్‌ ష్లాన్‌ను రూపొందించడంలో వివిధ దశలలో పరిశీలించి నివేదిక అందించాలని, క్షేత స్థాయిలో ఖచ్చితమైన పరిశీలన చేసుకోవాలని తెలిపారు. అన్ని పురపాలక సంఘాల కమీషనర్లు ఆయా శాఖలకు కేటాయించిన పనుల జాబితా పూర్తి వివరాలతో తయారు చేయాలని తెలిపారు. పనులలో భాగంగా భూ సేకరణలో ప్రభుత్వ ఇతరత్రా భూములపై క్షుణ్ణంగా పర్యవేక్షించి ఎలాంటి తప్పులు లేకుండా ప్లాన్‌ రూపొందించాలని తెలిపారు. ప్లాన్‌ ఆచరణకు ముందు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించడం జరుగుతుందని, ఇందు నిమిత్తం విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నల్మాసు కాంతయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post