మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ఆధునీకరించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 2023-24 మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమీషనర్ జి.రాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ గాజుల ముఖేష్‌గౌద్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల పురపాలక సంఘాన్ని అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించాలని, ఈ క్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి కాపాడుకోవాలని, ఆక్రమణకు గురైన భూములను స్వాధీనపర్చుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పకదృంధీగా చేపట్టాలని, అందుబాటులో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని వార్డుల వారిగా విభజించి పనులు నిర్వహించాలని, వార్డు కాన్సిలర్హు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని, అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధజలం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పైప్‌లైన్ల లీకేజీ, మరమ్మత్తు పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవి సమీపిస్తున్నందున నీటి సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్నులు బకాయి లేకుండా 100 శాతం పూర్తి చేయాలని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని పురపాలక సంఘ సుందరీకరణ, ఆధునీకరణకు వినియోగించుకోవచ్చని, పన్ను వసూలు ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం తీసుకోవాలని తెలిపారు. వార్డులలో వీధి కుక్కలు, కోతులు, పందుల బెడద లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. 2023-24 వార్షిక అంచనా బడ్జెట్‌లో సాధారణ ఆదాయం 32 కోట్ల 43 లక్షల రూపాయలు, క్యాపిటల్ ఆదాయం 22 కోట్ల 94 లక్షల రూపాయలుగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. సాధారణ వ్యయములు 25 కోట్ల 68 లక్షల రూపాయలు, క్యాపిటల్ వ్యయములు 6 కోట్ల 75 లక్షల రూపాయలు, గ్రాంటులు 22 కోట్ల 61 లక్షల రూపాయలు, డిపాజిట్లు, అడ్వాన్లులు 33 లక్షల రూపాయలుగా ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరుల పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.