MNCL : మన ఊరు – మన బడి కార్యక్రమ లక్ష్యాలను మార్చి మాసాంతంలోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

మార్చి మాసాంతంలోగా మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడత ఎంపికైన 248 పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, ైెనీ కలెక్టర్‌ పి.గౌతమి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ, ప్రజా ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు, గిరిజన సంక్షేమ శాఖలు, ఏజెన్సీలతో మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల్లో మిగిలి ఉన్న పెయింటింగ్‌, గ్రీన్‌ చాక్‌బోర్జ్‌, ప్రవారీగోడ, బెంచీలు, మౌళిక సదుపాయాల పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత శాఖల ఏజెన్సీలు, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు ఆయా మండలాలలో జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను క్షేత స్థాయిలో పరిశీలించి ప్రతి వారం పెండింగ్‌ పనులను అప్‌డేట్‌ చేయాలని, మార్చి మాసాంతంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మండలాల వారిగా ఆయా పాఠశాలల్లో మిగిలి ఉన్నమూత్రశాలలు, శౌచాలయాలు, వంటశాలలు, భోజనశాలలు ప్రవారీగోడ పనులను వేగవంతం చేసి నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. మండలాల వారిగా సంబంధిత ఏజెన్సీలు, ఏ. ఈ.లు, డి. ఈ.లతో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల పనుల పురోగతి లక్ష్యాలను సమీక్షించి పనులు సూచనలు, సలహాలు చేశారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకురావాలని అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం అభివృద్ధి పనులపై ప్రతి వారంలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించి కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్‌ ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈ. ఈ. జాదవ్‌ ప్రకాష్‌, డి.ఈ.లు, ఏ.ఈ.లు, సంబంధిత శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post