MNCL : మన ఊరు – మన బడి పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌

విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లాలో కార్యక్రమం మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో టైనీ కలెక్టర్‌ పి.గౌతమితో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, నోడల్‌ అధికారి స్టర్‌ అలీఖాన్‌, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో 248 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ [గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అదనపు గదులు, ప్రవారీగోడ, వంటశాల, భోజనశాల, మూత్రశాలలు, త్రాగునీరు, విద్యుత్‌ పనులను పూర్తి చేయాలని తెలిపారు. 36 ఆదర్శ పాఠశాలల్లో పెయింటింగ్‌, గ్రీన్‌ చాక్‌ బోర్జులు, డ్యుయల్‌ డెస్క్‌ల పంపిణీపై దృష్టి సారించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post