MNCL : మహనీయుల త్యాగాలు భావితరాలకు తెలిసేలా వజ్రోత్సవ వేడుకలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ మహోత్సవాలు జరుపుకుంటున్నామని, మహనీయుల త్యాగాలు చేశారని, పోరాట విలువ భావి తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాల నిర్వహణ ఉండాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, డి.సి.పి. అఖిల్‌ మహాజన్‌, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవిలతో కలిసి జిల్లా అధికారులతో వజ్రోత్సవ వేడుకలు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన వననమహోత్సం కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలు, వసతిగృహాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఫ్రీడమ్‌ పార్కులలో మొక్కలు నాటేందుకు నియమించిన ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, మండల, పురపాలక సంఘాలు, జిల్లా స్థాయిలలో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పురపాలక, గ్రామపంచాయతీ, జిల్లా స్థాయిలో వార్డుల వారిగా బృందాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 11న ఫ్రీడమ్‌ రన్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. 12న జాతీయ సమైఖ్యత రక్షా బంధన్‌ సందర్భంగా స్థానిక కేబుల్‌ ఛానళ్లలో దేశభక్తి ఉట్టిపడేలా చిత్ర ప్రదర్శన చేయాలని తెలిపారు. 18న విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులతో జెండా, ప్లకార్డులతో ర్యాలీ, (గామపంచాయతీలు, పట్టణాల పరిధిలోని మైదానాలలో సాయంత్రం వేళలలో త్రివర్జంతో కూడిన బెలూన్‌ల విడుదల చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 14న జిల్లా నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమన్వయంతో జానపద కళా ప్రదర్శన, సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో బాణాసంచా కాల్పాలని తెలిపారు. 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ, 16న తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో కవి సమ్మేళనం, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాల నిర్వహణ, 18న ఫ్రీడమ్‌ కప్‌ పేరిట క్రీడల నిర్వహణ, 19న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్ళలో పండ్లు, సీట్లు పంపిణీ, 20న దేశభక్తి చాటేలా మహిళలకు రంగోలి కార్యక్రమం, 21న గ్రామ, మండల, పురపాలక, జిల్లా పరిషత్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, పట్టణాలలో మున్సిపల్‌ కమీషనర్లు, కౌన్సిలర్లు బాధ్యతగా తీసుకోవాలని, గ్రామస్థాయిలో టాం-టాం చేయాలని, పట్టణ స్థాయిలో ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి విసృత ప్రచారం చేయాలని అన్నారు. గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, విద్యాసంస్థలలో వేడుకల నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన వారికి అవార్డు ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post