MNCL : మిల్లర్లు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

రైస్‌మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా సహకరించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వరిసాగుకు అనుగుణంగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని, రోజువారిగా కనీసం 8 వేల మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, రైస్‌మిల్లుల సామర్థ్యం, పరిస్థితిని బట్టి యూనియన్లు వారికి తగు లక్ష్యాలను కేటాయించాలని తెలిపారు. ఉపయోగకరంగా ఉన్న గన్నీ సంచులను వినియోగిస్తూ అవసరమైన మేరకు నూతన గన్నీ సంచుల కొరకు తగు ప్రతిపాదనలు తయారు చేసి అందించాలని తెలిపారు. జిల్లాలో 89 రైస్‌మిల్లులు ఉండగా ఇటీవల కురిసిన భాదీ వర్షాల కారణంగా రెండు రైస్‌మిల్లులలో వరదనీరు చేరిందని, వరద కారణంగా దెబ్బతిన్న రైస్‌మిల్లుల వివరాలను అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పారసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్‌, రైస్‌మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, రైస్‌మిల్లర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post