రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భారతి హోళ్ళికేరి అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్, ప్రపంచ తలసేమియా దినోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎఫ్.సి.ఎ. ఫంక్షన్‌హాల్ లో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిలొసెల్ వ్యాధిగ్రస్తుల అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రమాద పరిస్థితులలో ఉన్న వారికి సమయానికి రక్తాన్ని అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. తలసేమియా, సికిలొసెల్ వ్యాధిగ్రస్తులకు వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుందని, అందుకుగాను రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని అందించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులలో హిమోగోబిన్, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులలో ఎర్రరక్తకణాలు అసాధారణంగా తగ్గిపోవడం జరుగుతుందని, ఈ స్థితి నుండి వీరిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని తెలిపారు. తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిని నిర్మూలించడానికి పెళ్ళికి ముందు యువతీ, యువకులు హెచ్.బి.ఎ.-2 పరీక్ష చేసుకోవాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి జీవితాంతం రక్తం ఎక్కించాలని, వేసవి కాలంలో రక్తం కొరత ఉంటుందని, యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించాలని తెలిపారు. లాక్డౌన్ సమయంలో వ్యాధిగ్రస్థులకు రక్తం అందించడంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని, ఆరోగ్యశ్రీ సదుపాయం లేని వారికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా పరీక్షల నిమిత్తం రుసుము తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రక్తంను ఎక్కించే సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుండి వ్యాధిగ్రస్తులు ఇక్కడకు వచ్చి సేవలు పొందుతున్నారని అన్నారు. తలసేమియా, సికిల్ సెల్ ట్రాన్స్ఫ్యూషన్ కేంద్రంను 2012వ సంవత్సరంలో ప్రారంభించి, నమోదు అయిన 717 మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులలో ప్రతి నెల 180 నుండి 200 మందికి ఉచితంగా రక్తాన్ని ఎక్కించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 14 వేల 389 మందికి రక్తాన్ని ఎక్కిస్తూ, దాతల ద్వారా &ఎన్.ఏ. నిర్ధారణ పరీక్షలను చేయించి, తేది: 08-05-2019 నుండి ఆరోగ్యశీ పథకం ద్వారా 1 వేయి 710 మంది వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఎక్కిస్తూ, నెలసరి మందులను, రవాణా, భోజన సదుపాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. జి.సుబ్బారాయుడు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల
భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, కమిటీ సభ్యులు, తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, వారి తల్లితండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.