MNCL : సమీకృత కలెక్టరేట్‌ పనులు త్వరగా పూర్తి చేసి సేవలు అందించేందుకు చర్యలు : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శనివారం జిల్లాలోని నస్సూర్‌లో జరుగుతున్న సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమి, సింగరేణి సంస్ధ శ్రీరాంపూర్‌ ఏరియా జి.ఎం. సంజీవరెడ్దితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ శాఖల ద్వారా పొందే సేవలన్నింటినీ ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాల నిర్మాణాలు చేపట్టిందని, ఈ (క్రమంలో జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్‌, పైప్‌లైన్‌, ఇతర భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. భవన సముదాయంలో అన్ని ప్రభుత్వ జిల్లా శాఖల కార్యాలయాలకు గదులు కేటాయించడం జరిగిందని, వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందని, భవన ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. సమీకృత కలెక్టరేట్‌ ద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు వేగవంతంగా అందుతాయని తెలిపారు.

అనంతరం ఇందారం ఎక్స్‌ రోడ్‌, శ్రీరాంపూర్‌-ఆసిఫాబాద్‌ రహదారి ప్రక్కన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, బైనీ కలెక్టర్‌ పి.గౌతమి, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్‌ ఏరియా జి.ఎం. సంజీవరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు స్వచ్చమైన సహజ వాయువుతో పాటు సమతుల్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో నాటి మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు మూడు వరుసలలో మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. నాటిన మొక్కలను సకాలంలో నీటిని అందించాలని, ట్రీగార్ట్‌ ఏర్పాటు చేసి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రోధ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాము, సంబంధిత అధికారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post