MNCL : సమీకృత కలెక్టరేట్ తో ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ సేవలు : ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్

మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభించనున్న సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ మరింత చేరువలో ఉంటాయని ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి. సి. పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, ట్రైన్ కలెక్టర్ పి. గౌతమితో కలిసి సందర్శించారు. కలెక్టరేట్ భవనంలోని జిల్లా శాఖల కార్యాలయాలు, దరఖాస్తుదారులు వేచి ఉండే ప్రాంతాలు, భవన ప్రాంగణం, గార్డెనింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సేవలు అన్నింటినీ ఒకే చోట అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను చేపట్టడం జరిగిందని, జిల్లాలోని నస్పూర్ లో ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ప్రజలకు చేరువలో ఒకే చోట ఉంటాయని, తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈనెల 9న కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నందున జిల్లా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post