MNCL : సామూహిక జాతీయ గీతాలాపన సమైఖ్యతను ప్రతిబింబిస్తుంది : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలలో మంగళవారం రోజున జిల్లాలోని గ్రామపంచాయతీ, మండల, జిల్లా కేంద్రాలలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన దేశ సమైఖ్యతను ప్రతిబింబించిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో ఏర్పాటు చేసిన గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డి.సి.పి. అఖిల్‌ మహాజన్‌, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి యువత, ఉద్యోగులు, వేలాది విద్యార్థులతో గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యమంలో వీరోచిత పోరాటాలు చేసిన యోధులు, మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వేచ్చ, స్వాతంత్రాలనునేడు మనం అనుభవిస్తున్నామని, వజోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన కనిపిస్తుందని, కుల, మత, వర్ణ, వర్గ విబేధాలు లేకుండా భారతీయులమనే సమానత్వ భావనతో ప్రజలంతా సమిష్టిగా ఐకమత్యంతో ఉండాలని తెలిపారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని దేశభక్తిని చాటడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ అభివృద్ధికి తోద్బడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post