MNCL : హరితహారం కార్యక్రమంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, సంరక్షణ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రెతో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, పంచాయతీ, రోడ్డ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, తూముల వెంట విసృతంగా మొక్కలు నాటేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల వెంట మొక్కకు మొక్కకు మధ్య 3 మీటర్ల వ్యత్యాసం ఉందేలా చూసి వరుస క్రమంలో మొక్కలు నాటాలని, మారేడు, అల్లనేరేడు, ఇతరత్రా రకరకాలైన మొక్కలను నాటాలని, వెదురు మొక్కలలో ఎదుగుదల వేగంగా ఉంటుందని తెలిపారు. రాళ్ళవాగు వెంట రెండు వైపులా వివిధ రకాల మొక్కలను వరుసగా నాటేందుకు కార్యచరణ రూపొందించాలని, గోదావరి పరివాహక ప్రాంతం 146 కిలోమీటర్లు కాగా మొక్కలకు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి తెల్లమద్ది, సర్వాయి, అల్లనేరేడు, త్వరగా పెరిగే మొక్కలను నాటాలని సూచించారు. నీల్వాయి వాగు పరివాహక ప్రాంతంలో రెండు వరుసలలో మొక్కలు నాటాలని, సుందిళ్ల, అన్నారం వద్ద 11 ఎకరాల భూమి ఉందగా అందులో యాదాద్రి పల్లెప్రకృతి వనాల తరహాలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాణహిత, కడెం ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మొక్కలు అనువైన ప్రదేశాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు. 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను జిల్లాలో గుర్తించిన ప్రదేశాలు, నాటేందుకు అవసరమైన మొక్కలు ఇతరత్రా పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయడంతో పాటు అవసరమైన ప్రణాళికలు రేపటి సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ఆర్‌.ప్రకాష్‌, నీటి పారుదల శాఖ అధికారి, రోడ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాము, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post