municipal adhikaarulatho sameeksha samaavesham – Collector

పట్టణ , స్థానిక సంస్థల పరిధిలో 2014 సంవత్సరం తరువాత అనుమతించిన లే అవుట్ల ఆడిట్ నిర్వహణ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ మునిసిపల్ కమీషనర్లను, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ లే అవుట్లలో 10 శాతం ఓపెన్ స్పెస్ స్థానిక, పట్టన సంస్థ పేరున రిజిస్టర్ చేయాలని, 10 శాతం కన్నా తక్కువ లే అవుట్ ఉంటె ఒరిజినల్ డెవెలపర్ నుండి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం పెనాల్టీ విధించాలని సూచించారు. డి.టి.సి.పి . మార్గదర్శలకాలకనుగుణంగా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఎక్కడైనా మునిసిపాలిటీలలో అనుమతులు లేకుండా అక్రమంగా గృహాలు నిర్మిస్తున్న, అనుమతికి మించి అదనంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిని కూల్చి వేయాలని ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కు సూచించారు. అదేవిధంగా అక్రమ లే అవుట్ల ను గుర్తించి తొలగించాలని అన్నారు. రెండు వారాలలోగా మీడియన్ లో, రోడ్డు కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని మునిసిపల్ కమీషనర్లకు సూచించారు. ఈ సంవత్సరం నిర్దేశించిన పన్ను వసూళ్లను ఇప్పటి నుండే లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా మునిసిపాలిటీలలో ఉన్న స్థిర, చరాస్తుల వివరాల జాబితా అందజేయవలసినదిగా కలెక్టర్ మునిసిపల్ కమీషనర్ల సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డి.పి .ఓ. తరుణ్ కుమార్ మునిసిపల్ కమీషనర్లు శ్రీహరి, మోహన్, ఆశ్రిత కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

Share This Post