NYK& NSS ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ క్లీన్ ఇండియా అభియాన్ ముగింపు వేడుకలు

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్ మహోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర మరియు జాతీయ సేవా పథకం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఘనంగా జరిగాయి

శనివారం జరిగిన ముగింపు వేడుకలను వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ తాటికొండ రమేష్
హాజరయ్యారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజుల పాటు జరిగిన క్లీన్ ఇండియా కార్యక్రమల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారుగా 25 టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సేకరించడం జరిగిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లలకు అభినందనలు తెలిపారు.

NSS జాతీయ స్థాయిలో పాల్గొన్న వాలంటీర్స్ ని,ప్రోగ్రామ్ ఆఫీసర్ని,అదేవిధంగా గా ప్రతిభ కనబరిచిన వారిని అతిధుల చేతుల మీదుగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి, ఎన్ఎస్ఎస్ కాకతీయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ నారాయణరెడ్డి,జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల,NSS ,NYKS వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post