నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్సీ మన తెలంగాణ/జహీరాబాద్ : పట్టణ పరిధిలో ఆదివారం మధ్యాహ్నంమిలన్ బిల్డింగ్ లో కిద్వాని ఆసుపత్రిని యాజమాన్యం ఆతిధ్యం మేరకుజహీరాబాద్ శాసనసభ సభ్యులు మాణిక్ రావు, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారు ఆసుపత్రి యాజమాన్యం తోకలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మొహమ్మద్ఫరీదుద్దీన్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో వైద్య సేవ అనేది చాల
ప్రాముఖ్యమైనది అని, వైద్యులు సమయ భావంతో ప్రజలకు మంచి సేవ చెసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడిమెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మైన్,సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్, తెరాస సీనియర్ నాయకులు సయ్యద్ మొహియుద్దీన్, గోరె మియా సికిందర్,మొహమ్మద్ అబ్దుల్ ముర్తుజా, ఆసుపత్రి యాజమాన్యం ఫజల్ , సురేష్వామ్మోరే, శ్రీలత వామ్మోరే, ఏం ఏ నదీమ్ తదితరులు ఉన్నారు.