Palle pragathi pai adhikaarulatho drushya sameeksha – Collector

ఆగస్టు 4 లోగా వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తి గావించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇటీవల భూమి గుర్తించి అప్పగించిన 7 వైకుంఠ ధామాలు మినహా మిగతావన్నీ ఆగస్టు 4 లోగా ఎట్టి పరిస్థితులలో పూర్తి గావించాలని, అవి మాత్రం ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని, ఎటువంటి కుంటి సాకులు చెప్పరాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పట్ల అత్యంత ప్రాముఖ్యత నిచ్చి ప్రగతిని వారం వారం సమీక్షిస్తున్నదని, కాబట్టి ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో పల్లె ప్రకృతి వనాలు నిర్వహిస్తూ వాటి చుట్టూ, వైకుంఠధామాల చుట్టూ బయో ఫెన్సింగ్ చేయాలని సూచించారు. మండలానికి 10 ఎకరాల చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలను చదును చేసి, ట్రెంచ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన మేరకు వనాలను అభివృద్ధి పరచి యాదాద్రి తరహా ప్లాంటేషన్ చేయాలని సూచించారు. 9 మండలాలలో మాత్రం గుర్తించిన అటవీ భూములలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను జిల్లా అటవీ శాఖాధికారి ఆధ్వర్యంలో చేయాలని సూచించారు. హరిత హారం కార్యక్రమం క్రింద 213 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్, జిల్లా పరిషద్ రహదారుల వెంట మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. హరిత హారం కార్యక్రం క్రింద ఇంటింటికి సరఫరా చేసిన మొక్కలకు సంబంధించి 8 మండలాల వారు మాత్రమే ఈ పంచాయత్ పోర్టల్ లో వివరాలు అప్ డేట్ చేసారాని మిగతా వారు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సుమారు వంద వరకు లే అవుట్ చేసిన ప్లాట్లు ఉన్నాయని, అవి న్యాయబద్దమైనవా , కావా అని పరిశీలించాలని, అందులో 10 శాతం ఓపెన్ ప్లేస్ గ్రామా పంచాయతీ పేర రిజిస్టర్ అయినదా లేదా చూసి, లేని పక్షంలో ఒరిజినల్ ఓనర్ నుండి అంతకు తగ్గ భూమి లేదా పెనాల్టీ వేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జెడ్.పి సి.ఇ .ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, ఏం.పి .ఓ.లు, ఏం.పి .ఓ.లు, సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post