పల్లె ప్రగతి కార్యక్రమం

ప్రతి గ్రామాన్ని పచ్చదనం గా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సోమవారం నాడు కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ మండలం గూడూరు ,వంగపల్లి గ్రామ పంచాయతీ లలో పర్యటించి, ఎవన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాలు, నర్సరీలు తనిఖీ లు చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఇంటిని రోజు శుభ్రం చేసినట్లే గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు.ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి కాపాడాలని సూచించారు ప్రతి గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలలో చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని‌‌‌,యజమానులకు నోటీసులు ఇచ్చి పరిశుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఖాళీ ప్రదేశంలలో మొక్కలను విస్తృతంగా నాటాలని తెలిపారు.ఎవెన్యు ప్లాంటేషన్ లో భాగంగా వీలున్న చోట పండ్ల మొక్కలు కూడా నాటాలని అన్నారు. నాటికి ప్రతి మొక్క ను సంరక్షించాలని ఆయన తెలిపారు. నర్సరీ లలో మొక్కలు గ్రామ ప్రజలు కు సరిపడా ఉంచాలని తెలిపారు. గ్రామ ప్రజలందరూ పల్లే ప్రగతి లో భాగస్వామ్యం చేయాలని ఆయన అన్నారు.అనంతరం కమలాపూర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశిలించారు. ఇండ్ల నిర్మాణంను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జగదీష్, ఎంపిడిఓ కల్పన ,ఎంపిఓ రవిబాబు,సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Share This Post