PM స్వనిధి లోన్ల పై బ్యాంకర్లు, మెప్మా, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్. (కరీంనగర్ జిల్లా)

వీధి వ్యాపారులకు రుణాలిచ్చి ప్రోత్సహించాలి

రెండో డోస్ వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి

అనుమతి లేని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలి

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం
00000

ప్రధానమంత్రి స్వానిధి పథకం ద్వారా వీధి వ్యాపారులను గుర్తించి వారికి రుణాలు ఇచ్చి వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, మెప్మా అధికారులు, బ్యాంకర్లతో ప్రధానమంత్రి స్వానిధి పథకం, కోవిడ్ వ్యాక్సినేషన్, అనుమతిలేని అక్రమకట్టడాల కూల్చివేత అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో గతంలో వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి పథకం ద్వారా రూ. 10 వేలు రుణంగా అందించామని తెలిపారు. సకాలంలో రుణాలను చెల్లించిన వీధి వ్యాపారులకు ఇప్పుడు కొత్తగా రూ. 20 వేల రుణం అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. ప్రధానమంత్రి స్వానిధి పథకం పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్, మెప్మా అధికారులను కోరారు. వీధి వ్యాపారుల కుటుంబాల వివరాలు సేకరించి వారికి బీమా వర్తింపజేయాలని తెలిపారు. కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ జిల్లాలో వంద శాతం పూర్తిచేసి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచామని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. అలాగే రెండో డోసు వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతంగా వంద శాతం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అనుమతి లేకుండా నగరములో నిర్మించే అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు, తాసిల్దార్ లకు సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

Share This Post