PM-DAKSH యోజన ద్వారా నైపుణ్య శిక్షణ : కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఎస్ కే శ్రీవాస్తవ

ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హిత్గ్రాహి యోజనా ద్వారా నైపుణ్య శిక్షణ పొంది ఉపాధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని యస్.కె. శ్రీవాస్తవ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి నేడోక ప్రకటనలో తెలిపారు.  యస్సిలు, ఓబీసీ,ఇబిసి, డిఎన్ టి వర్గానికి చెంది 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మహిళలు, పురుషులు ట్రాన్సజెండర్లు ఎవరైనా సరే PM-DAKSH అనే యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి తమ మొబాయిల్ లో డౌన్లోడ్ చేసుకొని లేదా pmdaksh.dosje.gov.in వెబ్సైట్లో  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  కార్మికులు, చేతివృత్తుల వారు, నిరుద్యోగ యువతి యువకులు ఈ పథకం ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ పొంది తమ చేతివృత్తి రంగంలో మరింత నైపుణ్యం పొందాటానికి మంచి అవకాశంగా తెలిపారు.  నిరుద్యోగ యువతి యువకులు తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొంది తద్వారా ఉపాధి పొందటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసారు.  గృహిణులు సైతం ఇంటి నుండి ఉపాధి పొందేందుకు ఈ ఉచిత  శిక్షణ తరగతులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. శిక్షణ తరగతులు కేటగిరి ని బట్టి 35 నుండి 60 గంటలు/5 నుండి 35 రోజులు ఉంటుందని తెలియజేసారు.  జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి వెంటనె ఆన్లైన్ ద్వారా కానీ మొబాయిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Share This Post