POలు,APOల తో జరిగిన సమీక్షా సమావేశం లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. ( కరీంనగర్ జిల్లా )

7-  కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలి

రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

డిస్ట్రిబ్యూషన్,  రిసెప్షన్,  కౌంటింగ్ సెంటర్ కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలోనే
000000

7-  కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి  ఈ నెల 10వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్  పోలింగ్ అధికారులకు సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్లు, పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర  అత్యంత ముఖ్యమైనదని అన్నారు. 7-  కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సంబంధించి  8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 1.కరీంనగర్లోని జడ్పీ కార్యాలయంలో, 2. హుజరాబాద్,  3. జగిత్యాల, 4. కోరుట్ల, 5. పెద్దపల్లి, 6. మంథని, 7. హుస్నాబాద్  ల లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, 8.   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్పీ కార్యాలయం లో పోలింగ్ కేంద్రాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.  ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.  ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారుగా 200 వరకు ఓటర్లు ఉంటారని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో  ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు  ఓటర్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు.  పోలింగ్ అధికారులు తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల సంఘం  సూచించిన 11 రకాల గుర్తింపుకార్డులలో  ఏదేని ఒకటి తనికి చేసుకున్నాకే ఓటు హక్కు   వినియోగించుకునేలా చూడాలని కోరారు. ఓటర్లు  బ్యాలెట్ పేపర్ పై   పోలింగ్ అధికారి అందజేసే వాయిలెట్ స్కెచ్ పెన్ తో మాత్రమే అంకెలను ప్రాధాన్యత క్రమంలో వేసేలా  వారికి చెప్పాలని సూచించారు.  బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్ పై ఓటర్ సంతకం  తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.  డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ పేపర్ లను, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. పోలింగ్  ప్రక్రియ ప్రారంభానికి ముందు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను చూపించిన తర్వాతనే సీల్ చేయాలని అన్నారు.  పోలింగ్ ప్రక్రియ ముగిశాక కూడా వారి సమక్షంలోనే సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు  తీసుకు రావాలని  తెలిపారు.  ప్రతి పోలింగ్ సెంటర్ కు  ఏ ఆర్ ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి)  ఉంటారని ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వారి దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పోలింగ్ అధికారులకు సూచించారు.  అనంతరము మాస్టర్ ట్రైనర్లు  వెంకట్ రెడ్డి ( కరీంనగర్ రూరల్ తాసిల్దార్),  జగత్ సింగ్  పోలింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై సమగ్ర శిక్షణ అందజేశారు.

 

Share This Post