Pollution control board meeting – Collector S.Harish

కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తడి ,పొడి చెత్త సేకరణ, నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మునిసిపల్ కమీషనర్ల సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్దతిలో రీ- సైకిల్ చేయవలసినదిగా ఆయన మునిసిపల్ కమీషనర్ల సూచించారు. వైద్యశాల నుండి వచ్చే బయో వ్యర్థాలను మునిసిపల్ వ్యర్థాలతో కలపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ వైద్యశాలల వ్యర్థ పదార్థాలు మునిసిపల్ వ్యర్థాలతో కలిపినచో కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయన సూచించారు. జిల్లాలో పనిచేయుచున్న ఆర్.ఏం.పి . డాక్టర్లు బయో వ్యర్థాలను బయట పడేయకుండా చూడాలని, లేకపోతె కేసులు పెడతామని హెచ్చరించాలని డి.ఏం.అండ్ హెచ్.ఓ. కు సూచించారు. మునిసిపల్ పరిధిలో నిషేదించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని మునిసిపల్ కమీషనర్లకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డిఎస్పీ కృష్ణ మూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఎన్వీర్న్మెంట్ ఇంజనీర్ రవి కుమార్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డి.ఏం.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, ఏ.డి. మైన్స్ జయరాజ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post