Premier Energies

సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్…

హైదరాబాద్ లో నెలకొల్పిన కొత్త ప్లాంటును ఈ నెల 29న ప్రారంభించనున్నది. తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానున్న ఈ కొత్త ప్లాంటును రూ.483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసినట్టు ప్రీమియర్ ఎనర్జీస్ మంగళ వారం తెలిపింది. కాగా, ఈ అత్యాధునిక ప్లాంటుతో దేశంలో ఐదు పెద్ద సౌర విద్యుత్తు పరికరాల తయారీ కంపెనీల్లో ఒకటిగా ప్రీమియర్ ఎనర్జీస్ ఆవిర్భవిస్తుంది. ఈ ప్లాంటు 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్ మల్టీ-క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్, మోనో పీఈ ఆర్సీ సెల్స్, మాడ్యూల్స్, పాలీ క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తవుతాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేండ్లలో తమ సౌర విద్యుత్తు ఉపకరణాల వార్షిక ఉత్పాదక సామ ర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలూజా వెల్లడించారు. వచ్చే నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ పెట్టుబడిదారుల కోసం పింక్ బుక్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Share This Post