కోవిడ్ సంక్షోభ సమయంలో యూనివర్శిటీ, కళాశాలల విద్యార్థుల అకడమిక్ సమస్యలు, ఇతర అకడమిక్ అంశాలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ లో “ఆస్క్ ఛాన్సలర్” అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల తో చర్చిస్తారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు ట్విట్టర్ లో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తో అకడమిక్ అంశాల పట్ల చర్చించవచ్చు.