Press Communique on 17.05.2021

                                        PRESS COMMUNIQUE

                                       Raj Bhavan, Hyderabad

                                              Date: 17.05.2021

           We must all strive for the Healthy Telangana: Governor

 

Hyderabad, May 17: Governor Dr. Tamilisai Soundararajan on Monday gave a call to all the people in the State to strive for ensuring Healthy Telangana State.

“We must be very cautious about the rapid spread of the COVID-19. We need to strictly adhere to all the preventive measures like wearing double mask and other COVID-appropriate behaviour to contain the spread and ensure healthy Telangana,” she said.

The Governor was interacting with the senior officials of the Raj Bhavan through video conference from Raj Nivas, Puducherry, where she is holding an additional charge as the Lt. Governor.

She directed Secretary to Governor, K. Surendra Mohan, to constantly monitor the Covid situation and coordinate with the State government for all the necessary steps to contain the pandemic.

“We are in a situation where almost every 5th person is a suspected COVID infected one. We must ensure the strict compliance with all the preventive guidelines,” she added.

The Governor emphasised on the protection of children from getting infected and expressed concern that more number of children were getting infected in the second wave.

Referring to the launch of 2-DG anti-COVID drug by the Defence Research and Development Organisation (DRDO), Dr. Tamilisai Soundararajan termed the drug as a potential ‘game changer’ in the treatment of COVID-19.

“I hope the 2-DG anti-Covid drug will be effective in preventing the virus growth by stopping viral synthesis as proved during the clinical trials. It is expected that the DRDO’s drug will contribute for the faster recovery of the patients and reduce their need for supplemental oxygen dependence,” she added.

Secretary to Governor K.Surendra Mohan appraised the Governor of the progress in vaccination drive, Covid situation and the measures like imposition of lockdown being taken in the State.

Joint Secretaries and other senior officials were present.

Press Secretary

                                        పత్రికా ప్రకటన

                             రాజ్ భవన్, హైదరాబాద్

                                     తేది. 17.05.2021

ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనకు ప్రజలందరూ కృషిచేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.

కోవిడ్ తీవ్రంగా ప్రబలుతున్న  ప్రస్తుత పరిస్థితులలో, ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా డబుల్ మాస్క్ ధరించడం, ఇతర నివారణ పద్ధతులను బాధ్యతగా పాటించడం అత్యంత అవశ్యం అని  గవర్నర్ అన్నారు.

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడి నుండి హైదరాబాద్ రాజ్ భవన్  లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు  నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఐదుగురిలో  ఒక్కరు కోవిడ్ బాధితులుగా మనం భావించుకొని, కోవిడ్ మహమ్మారి   మరింత ప్రబలకుండా అందరూ జాగరూకులై ఉండాలని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.

సమిష్టి కృషితో, సమిష్టి బాధ్యత తోనే మనం ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకో గలం అని గవర్నర్ వివరించారు.

కోవిడ్ ఈ రెండో దశలో అనేక మంది చిన్న పిల్లలు కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు.

ఇలాంటి సందర్భంలో చిన్నారుల పట్ల మరింత శ్రద్ధ వహించి వారు కోవిడ్ బాధితులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డాక్టర్ తమిళిసై తెలిపారు.

డి ఆర్ డి ఓ తయారుచేసిన 2- డి జి యాంటీ  కోవిడ్ మందు  సత్ఫలితాలను ఇస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు.

కోవిడ్ చికిత్సలో ఈ డ్రగ్ ఒక గేమ్  చేంజర్   గా పనిచేస్తుందని గవర్నర్ ఆశించారు.

రాష్ట్ర ప్రభుత్వం తో చక్కని సమన్వయంతో కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సింది  గా  గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్ర మోహన్ కు గవర్నర్ సూచించారు.

ఈ సందర్భంగా గవర్నర్  కు రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు, టెస్టులు,  పాజిటివ్ కేసుల సంఖ్య, రికవరీ కేసుల సంఖ్య, అలాగే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు అవుతున్న తీరును సురేంద్రమోహన్ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ సెక్రటరీ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రెస్ సెక్రటరీ

 

Share This Post