Press Communique on 21.06.2021

పత్రికా ప్రకటన

రాజ్ భవన్, హైదరాబాద్

తేది. 21.06.2021

తెలంగాణ రాష్ట్ర గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె. స్టాలిన్ ను ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ కు గవర్నర్ రాజ్ భవన్ లో పండించిన మామిడి ఫలాలను అందజేశారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి ఎయిర్ పోర్టుకు 200 ఎకరాల స్థలం కేటాయించి పాండిచ్చేరి ఎయిర్ పోర్టు విస్తరణకు సహకరించాలని కోరారు. ఈ ఎయిర్ పోర్టు తమిళనాడు సరిహద్దు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగమని ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రి టి.ఆర్. బాలు కూడా పాల్గొన్నారు.

ప్రెస్ సెక్రటరీ

Share This Post