Press Communique on 22.05.2021.

                                                            PRESS COMMUNIQUE

                                                          Raj Bhavan, Hyderabad

                                                               Date: 22.05.2021

Governor calls upon doctors to constantly upgrade knowledge and expertise in their chosen specialisations

 

Hyderabad, May 22: Governor Dr. Tamilisai Soundararajan on Saturday exhorted the doctors and other healthcare professionals to constantly upgrade their knowledge and expertise in their chosen specialities.

“Doctors are in life saving profession. It is vital for them to keep abreast of the latest developments in their fields and learn about the best practices to offer better services to the patients,” she said.

The Governor was virtually launching the Continuing Medical Education programme titled “API initiated therapy specific recommendations for tele-consultation in diabetes and cardiology,” organised by the Association of Physicians of India, from Raj Bhavan, here.

Dr. Tamilisai Soundararajan stated that the Covid-19 has altered the way we work, learn, and live and we must rise to the challenge by using technology to help the needy.

 “The pandemic must not deter us from learning the best practices in medicine from all over the world. And I appreciate the digital outreach to the participants offered by the Association of Physicians of India to facilitate the continuing medical education,” she added.

Referring to the sacrifices being made by the healthcare workers as frontline warriors in our fight against the pandemic, the Governor termed their services as brave, committed, dedicated and selfless.

The Governor also paid rich tributes to those doctors and other healthcare workers, who laid down their lives fighting against the invisible enemy, the virus.

Dr. Tamilisai Soundararajan said that diabetes and cardio vascular diseases are affecting millions of people and it was high time that we create greater awareness among people for their prevention and management.

Association of Physicians of India national president Dr. Kamlesh Tewary, immediate past president Dr. S. Arul Rhaj, Vivek Kamath, Dr. Nihar Mehta and others were among those who spoke at the inaugural.

Governor’s husband, eminent Nephrologist Dr. P. Soundararajan and Secretary to Governor K. Surendra Mohan were present.

Press Secretary

                                                           

 

                                                                   పత్రికా ప్రకటన

                                                             రాజ్ భవన్, హైదరాబాద్

                                                                  తేది. 22.05.2021

వైద్యులు  తాము ఎంచుకున్న స్పెషలైజేషన్ లో నిరంతరం  తమ నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.

ఆరోగ్య సంరక్షకులుగా జీవన ప్రదాతలుగా  వైద్యులు  ఒక విశిష్టమైన వృత్తి లో ఉన్నారు.  వారు తమ సబ్జెక్టుకు సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని చికిత్సా పద్ధతులు  మెరుగుపరుచుకోవాలని గవర్నర్  సూచించారు.

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదలైన కంటిన్యూఇంగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో గవర్నర్ ఈరోజు రాజ్ భవన్ నుండి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  కోవిడ్ సంక్షోభం మనం  జీవించే విధానాన్ని, నేర్చుకునే విధానాన్ని సమూలంగా మార్చేసింది అన్నారు.

సవాళ్లను ఎదుర్కొంటూ మన నైపుణ్యాలను పెంచుకోవడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని గవర్నర్ ఉద్బోధించారు.

డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ రోగాలు కొన్ని  కోట్ల మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి అని ఈ వ్యాధుల పట్ల మరింత  అవగాహన, చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని  గవర్నర్  సూచించారు.

సరైన అవగాహన తోనే ప్రజలు డయాబెటిస్, హృద్రోగ సంబంధమైన  వ్యాధుల నివారణలో, వాటి చికిత్సలో  భాగస్వామ్యులు కాగలుగుతారు అని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కోవిడ్ పై పోరులో భాగంగా వైరస్ బారిన పడి ప్రాణాలు అర్పించిన డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది కి గవర్నర్ నివాళులు అర్పించారు.

సంక్షోభ సమయంలో హెల్త్ కేర్ సిబ్బంది చూపెడుతున్న అసమానమైన దీక్ష,   త్యాగనిరతి, సేవలు స్ఫూర్తిదాయక మని వారికి సెల్యూట్ చేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కమలేశ్ తివారి, పూర్వ అధ్యక్షులు అరుల్ రాజ్ , నిహార్ మెహతా, వివేక్,  కామత్ తదితరులు ప్రసంగించారు.

ప్రెస్ సెక్రటరీ

 

Share This Post