Press Communique on 22.05.2021.

                                                            PRESS COMMUNIQUE

                                                           Raj Bhavan, Hyderabad

                                                              Date: 22.05.2021

 

Governor reviews Sputnik-V and 2DG anti-Covid drug manufacturing and distribution progress

Hyderabad, May 22: Governor Dr. Tamilisai Soundararajan on Saturday termed the efforts of Dr. Reddy’s Laboratories in expediting the Sputnik-V vaccine and 2DG anti-Covid drug production as commendable.

She hoped that the expedited production of Sputnik-V vaccine doses and the 2DG anti-Covid drug, developed in collaboration with the DRDO, will be a total game changer in our country’s fight against the Covid-19 pandemic. She said that the vaccine is the only permanent protection from the pandemic.

The Governor was reviewing the progress in production and distribution of Sputnik-V vaccine and the 2DG drug through a video conference with the Dr. Reddy’s Laboratory representatives from Raj Bhavan, here, on Saturday evening.

The Governor appreciated the efforts of the Dr. Reddy’s Laboratories for partnering with the DRDO in coming out with the indigenous drug like 2DG anti-Covid drug.

“The development of indigenous 2DG drug is in the true spirit of Atma Nirbhar Bharat and vocal for local mandate given by Hon’ble Prime Minister Narendra Modi ji,” she added.

Dr. Tamilisai Soundararajan urged the Dr. Reddy’s Laboratory to expedite the vaccine production in our country and ensure the availability of the vaccine doses to maximum number of people at the earliest so to protect our people from the pandemic.

The representatives of the Dr. Reddy’s Laboratories informed the Governor that by end of July, they would get 2 crore doses of vaccine consignments from Russia.

They stated that efforts were on to produce the vaccine in five Indian sites with collaborative efforts. They were confident to make 15 to 20 crore doses of vaccine available during the next six months through imports and manufacturing within the country. “The equitable allocation of vaccine will be ensured to all the States in our country,” they added.

Dr. Reddy’s Laboratories’ representatives Kapil, Mallikarjuna Rao, Vemuri Vishwanath, and Ravi interacted with the Governor during the review.

Governor’s husband, renowned Nephrologist Dr. P. Soundararajan and Secretary to Governor K. Surendra Mohan were present.

Press Secretary

 

                                                                  పత్రికా ప్రకటన

                                                        రాజ్ భవన్, హైదరాబాద్

                                                                తేది. 22.05.2021

వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

కోవిడ్ పోరాటంలో  వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు.

వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు.

గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్  లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ ఇలాంటి పలు అంశాలను చర్చించారు.

డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ నుండి డి ఆర్ డి ఓ సంయుక్త భాగస్వామ్యంతో 2 డీ జి  ఔషధం రావడం, ఇది సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆత్మ నిర్బర్ భారత్  ఆశయానికి అనుగుణంగా ఉందని గవర్నర్ ప్రశంసించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్  ప్రతినిధులు తాము ఈ జూలై నెల ఆఖరి వరకు  దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకుంటామని గవర్నర్  కు తెలిపారు.

అలాగే ఈ సంవత్సరం ఆఖరి వరకు దిగుమతుల ద్వారా,  మన దేశంలోనే తయారీ ద్వారా దాదాపు 15  నుండి 20 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెస్తామని గవర్నర్ కు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నుండి కపిల్, మల్లికార్జున రావు, వేమూరి విశ్వనాధ్, రవి తదితరులు పాల్గొని వివిధ అంశాలను డాక్టర్ తమిళిసై కి వివరించారు.

చిన్న పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగాలు త్వరితగతిన విజయవంతం చేసి కోవిడ్ బారి నుండి వారిని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని గవర్నర్ వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ గారి భర్త ప్రముఖ నెఫ్రాలజిస్టు డా. పి. సౌందరరాజన్, గవర్నర్ గారి సెక్రటరీ కె. సురేంద్రమోహన్ పాల్గొన్నారు.

ప్రెస్ సెక్రటరీ

 

 

Share This Post