Press Communique on 25.05.2021 – JNTU Vice-Chancellor calls on Hon’ble Governor.

                                                           PRESS COMMUNIQUE

                                                           Raj Bhavan, Hyderabad

                                                              Date: 25.05.2021

 

                                        JNTU Vice-Chancellor calls on Governor

Hyderabad, May 25: Prof. Katta Narasimha Reddy, the newly appointed Vice-Chancellor of JNTU, Hyderabad, has called on Governor Dr. Tamilisai Soundararajan at Raj Bhavan, here, on Tuesday.

Dr. Tamilisai Soundararajan, who is also the Chancellor of the State universities, instructed the Vice-Chancellor to focus on promoting innovation and research in the university in the true spirit of Atma Nirbhar Bharat, envisioned by Prime Minister Narendra Modi.

“We must gear up research, development, and innovation in our universities in order to meet the global challenges and ensure self-reliance of our country in science and technology,” she added.

The Governor also directed the Vice-Chancellor to improve the alumni network and rope in their services leveraging the Chancellor Connects Alumni initiative launched by the Raj Bhavan for the all-round development of the university.

On the occasion, the Prof. Narasimha Reddy presented a book on Nano Technology penned by him and another book brought out on the occasion of his retirement as the vice-chancellor of Mahatma Gandhi University in his earlier stint.

Secretary to Governor K. Surendra Mohan and other senior officials were present.

Press Secretary

 

                                                                         పత్రికా ప్రకటన

                                                                రాజ్ భవన్, హైదరాబాద్

                                                                       తేది. 25.05.2021

జె ఎన్ టి యు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈరోజు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యూనివర్సిటీలో పరిశోధనలు, అభివృద్ధి, ఇన్నోవేషన్ పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత దేశము సైన్స్, టెక్నాలజీ రంగాలలో స్వయం సమృద్ధి సాధించడానికి అభివృద్ధి పరిశోధనలు, ఇన్నోవేషన్ అత్యంత ఆవశ్యకమని డాక్టర్ తమిళిసై అన్నారు.

ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్  సూచించారు.

విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల నెట్వర్క్  బలోపేతం చేయవలసిందిగా గవర్నర్ జె ఎన్ టి యు వైస్ ఛాన్సలర్ కు సూచించారు.

పూర్వ విద్యార్థుల సేవలు ఉపయోగించుకొని యూనివర్సిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే అవకాశం ఉందని డాక్టర్ తమిళిసై వివరించారు.

ఈ దిశగానే రాజ్ భవన్ ఆధ్వర్యంలో చాన్సలర్ కనెక్ట్ అల్యూమిని అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి తాను రచించిన నానో టెక్నాలజీ అనే పుస్తకాన్ని, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో గతంలో వైస్ ఛాన్సలర్ గా రిటైర్ అయినప్పుడు సహచరులు శ్రేయోభిలాషులు ప్రచురించిన మరో పుస్తకాన్ని గవర్నర్ కు అందజేశారు.

ప్రెస్ సెక్రటరీ

Share This Post