మంకమ్మతోట,కాశ్మీరుగడ్డ లో ఇంటింటి జ్వర సర్వ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన.       తేదీ: 22-1-2022
కరీంనగర్

ప్రతి ఇంటికి వెళ్లి జ్వర  సర్వే నిర్వహించాలి

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి . కర్ణన్

నగరంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించిన  కలెక్టర్
00000

ప్రతి ఇంటికి వెళ్లి జ్వర  సర్వేను
(ఫీవర్ సర్వే) ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

శనివారం నగరం లోని మంకమ్మ తోట, కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, ఆర్ పి లు చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటి యజమానులతో మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషను తీసుకున్నారా అని అడుగగా, వారు తీసుకున్నామని తెలిపారు. మంకమ్మ తోటలో సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది వద్దకు బూస్టర్ డోస్ తీసుకునేందుకు వచ్చిన కృష్ణవేణి అనే మహిళతో కలెక్టర్ మాట్లాడారు. ఇది వరకు ఎప్పుడైనా కరోనా వచ్చిందా అని అడుగాగ రాలేదని ఆమె తెలిపింది. కాశ్మీర్ గడ్డ  లో కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకు కలెక్టర్ ధైర్యం చెప్పారు.  మందులు సరిగా వాడితే తగ్గుతుందని అన్నారు. అక్కడే ఉన్న వ్యక్తి  మాస్క్ ధరించకుండా కనబడగా కలెక్టర్ ఆ వ్యక్తికి మాస్క్ ఇచ్చి ధరింపజేసారు . ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
జ్వరంతో బాధ పడుతున్న వారికి కోవిడ్  పరీక్షలు నిర్వహించి హోం  ఐసోలేషన్ ఔషధ కిట్లు అందజేయాలని సర్వే బృందాన్ని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకుని మందులు వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటి ఫీవర్ సర్వే లో జ్వరంతో బాధపడుతున్న వారిని, కోవిద్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య కార్యకర్తలను  కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని అన్నారు. ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్, స్వశక్తి మహిళా సంఘ సభ్యులు, ఆర్ పి లు బాధ్యతాయుతంగా సర్వేను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకొని వారికి వ్యాక్సిన్ అందజేయాలని అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించెలా అవగాహన కల్పించాలని సర్వే బృందం సభ్యులకు సూచించారు. కోవిడ్ మూడవ దశ ఓమిక్రాన్ ప్రాణాంతకం కాకున్నప్పటికి, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్య సిబ్బంది, సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది

 

Press note : మంకమ్మతోట,కాశ్మీరుగడ్డ లో ఇంటింటి జ్వర సర్వ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

Share This Post