Press note. 02.02.2023 మన ఊరు మన బడి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కోరారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు మన బడి పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్షిస్తూ, ఈనెల 10 లోగా అన్ని ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో మన ఉరు మన బడి కార్యక్రమంలో భాగంగా పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, కిచెన్ షేడ్ , సుందరీకరణ, ఇతర పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభించుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉపాధి హామీ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని తెలిపారు..

సమీక్షలో జెడ్పీ సీఈఓ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, తదితరులు పాల్గొన్నారు.

…..DPRO YADADRI

Share This Post