శనివారం నాడు రామన్నపేట జూనియర్ కళాశాల విద్యార్ధినులు CGT కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ వృత్తి విద్యాకోర్సు ద్వారా తయారు చేసిన 30 డ్రెస్సులను భువనగిరి పట్టణం తారకరామనగర్ లోని 2 అంగన్వాడీ సెంటర్ల చిన్నారులకు జిల్లా కలెక్టరు అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు రామన్నపేట జూనియర్ కాలేజీ విద్యార్ధినులను అభినందించారు. కష్టపడి చదవాలని, ఇష్టమైన సబ్జెక్టులలో, వృత్తి విద్యాకోర్సులలో అభివృద్ధి సాధించాలని అన్నారు. సామాజిక కార్యక్రమాలలో ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకొని పరస్పర సహకారం అందించుకోవాలని, విద్యార్ధులను సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకునేలా చేయాలని, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, ప్రిన్సిపాల్స్ చంద్రకళ, పాపిరెడ్డి, సిడిపిఓ స్వరాజ్యం సూపర్వైజరు పద్మ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
…….DPRO., YADADRI.