Press note. 04.2.2023. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు కాన్ఫరెన్స్ హాలులో తన అధ్యక్షతన జరిగిన డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఉదయం 6.00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అనుమతులు, రవాణా తీరు పట్ల ప్రతి 15 రోజులకు ఒకసారి విజిలెన్స్ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఖనిజ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా నీటిపారుదల అధికారి నరసింహులు, ఆర్.డబ్ల్యు. ఎస్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్, టీఎస్ఎండిసి ప్రాజెక్టు డైరెక్టర్ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

……..DPRO., YADADRI.

Share This Post