Press Note 06-06-2022 ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు.

సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు నుండి 53 ఫిర్యాదులు అందిన్నట్లు వాటిని సంబంధిత శాఖలకు పరిష్కార నిమితం అంజేయడం జరిగిందని వారు అన్నారు.

ప్రజావాణిలో 04 ఫిర్యాదులు రెవిన్యూ శాఖ, 39 తహశీల్ధార్ భువనగిరి , 01 భువనగిరి మున్సిపాలిటీ, చౌటుప్పల్ మున్సిపాలిటీ 1 ఫిర్యాదు , , 4 ఫిర్యాదులు జిల్లా పంచాయితీ అధికారి, డీసీపీ 1 ఫిర్యాదు, మత్స్య శాఖ 1 , సర్వే అండ్ ల్యాన్డ్ రికార్డ్స్ 1 , SDC 1 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

ప్రజావాణిలో కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి ,తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post