Press Note 06-5-2022 శుక్రవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి దళితబంధు లబ్దిదారులు శ్రీమతి బొల్లారం నర్సమ్మ, శ్రీమతి బొల్లారం రేఖ పేపర్ కప్స్, ప్లేట్స్ యూనిట్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయితీ వద్ద గ్రామ సభలో పాల్గొన్నారు.

పునర్నిర్మాణ పనులకు సంబంధించి గ్రామపంచాయితీ ద్వారా తీర్మాణాలు చేసి త్వరలో ఇవ్వాలని కోరారు. రోడ్డు పనులను పరిశీలిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఎస్.సి.కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, తహశీలుదారు రవికుమార్, ఎంపిడిఓ శ్రీమతి ఉమాదేవి, పంచాయితీరాజ్ డిఇ వెంకటేశ్వర్లు, ఎంపిఓ శ్రీమతి శ్రీమాలిని, వాసాలమర్రి గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపిటిసి నవీన్ కుమార్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు..

అనంతరం తుర్కపల్లి తహశీలుదారు కార్యాలయాన్ని, రికార్డులను తనిఖీ చేశారు. వారం లోగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తహశీలుదారును ఆదేశించారు.

Share This Post