Press Note 09-5-2022 ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.

 

సోమవారం నాడు జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ శాఖలకు సంబంధించి 42 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు.

అందులో రెవిన్యూ శాఖ 32, జిల్లా పంచాయితీ కార్యాలయము, భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయము, ధరణి విభాగము 2 ఫిర్యాదుల చొప్పున, జిల్లా విద్యా అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, యాదాద్రి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయము ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

అనంతరం జిల్లా కలెక్టరు జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా ప్రజలు ఇచ్చిన సమస్యల దరఖాస్తులను ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు డి శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి నాగేశ్వరా చారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post