ఆలయ విశిష్టతలు, ఆలయ పునర్నిర్మాణ రీతులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బృంద సభ్యులకు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమైన దేవాలయమని, ఆర్కిటెక్ పనులు అమోఘమని బృందం కొనియాడింది.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, నేషనల్ డిఫెన్స్ కాలేజీ నోడల్ లైజనింగ్ అధికారి వెంకట శరత్, ఆలయ సిబ్బంది ఉన్నారు.
…….DPRI., YADADRI.