Press note. 1.2.2023. స్వయం సహాయక సంఘాల పనితీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని, రుణాల తిరిగి చెల్లింపు 99 శాతం ఉన్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

 

బుధవారం నాడు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ సంబంధించిన 26 మంది నేషనల్ రిసోర్స్ పర్సన్స్ బృందం జిల్లా కలెక్టర్ గారిని కలిసింది.

అంతకు ముందు ఈ బృందం బీబీనగర్ లోని వెంకిర్యాల గ్రామం, భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించారు. బ్యాంకు రుణాల ద్వారా వారు పొందుతున్న జీవనోపాదులను, అలాగే రుణాల తిరిగి చెల్లింపులను స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంది.

అనంతరం బృందం జిల్లా కలెక్టరేటులో జిల్లా కలెక్టరుతో సమావేశమైంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరిస్తూ, జిల్లాలో 14,645 మహిళా స్వయం సహాయక సంఘాలలో 1,56,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఈ సంఘాలకు ఈ సంవత్సరం ఇప్పటివరకు 427 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని, 565 గ్రామ సంఘాలు, 17 మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే నిర్వహిస్తున్న ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టం మైక్రో క్రెడిట్ ప్లాన్ విధానాన్ని వివరించారు. మహిళా సంఘాల సంస్థాగత నిర్మాణంలో భాగంగా, మహిళా సాధికారత దిశగా చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు, మండల, జిల్లా సమాఖ్యలలో నాయకత్వ మార్పిడి ద్వారా అందరిలో చైతన్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల రుణాల తిరిగి చెల్లింపులు 95 శాతం ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

……DPRO., YADADRI.

Share This Post