Press Note 10-05-2022 జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా అమలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

మంగళవారం నాడు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్స్ 2020 ఐ.ఎ.ఎస్. బ్యాచ్ బి.రాహుల్, మకరంద్ మండే, అశ్విని వాక్టే, అపూర్వ్ చౌహన్, మయంక్ మిట్టల్, ప్రతిభా సింగ్, అభిషేక్ అగస్త్య బృందం జిల్లా కలెక్టర్ ను కలుసుకున్నారు. డాక్టర్ మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఇనిస్టిట్యూట్ లైసన్ ఆఫీసర్ సి.రాంబాబు వారి వెంట ఉన్నారు.

కాన్ఫరెన్స్ హాలులో వారితో సమావేశమైన జిల్లా కలెక్టరు జిల్లాలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, గ్రామ సీమల వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు, పచ్చదనం, పారిశుద్యం పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాలలో కావలసిన మొక్కలు ఆ గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా పెంచడం, అవెన్యూ ప్లాంటేషన్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 421 గ్రామాలలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీల ఏర్పాటు ద్వారా మొక్కల సంరక్షణకు వాటరింగ్ చేపట్టడం, ట్రాలీల ద్వారా ఇటింటి నుండి తడిచెత్త పొడి చెత్త విడివిడిగా సేకరించడం, సెర్రిగేషన్ షెడ్స్ ద్వారా ఎరువుల తయారీ ఏర్పాట్లు, పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 421 గ్రామ పంచాయితీలలో 418 వైకుంఠధామాలు, 419 సెగ్రిగేషన్ షెడ్స్, 650 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో వినియోగంలోకి తేవడం జరిగిందని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పనుల క్రింద గత 2021-22 సంవత్సరంలో 37 లక్షల 13 వేల పని దినాలు కల్పించడం జరిగిందని, ఈ 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1లక్షా 51 వేల మంది కూలీలకు 6 లక్షల 12 వేల పని దినాలు కల్పించడం జరిగిందని, వారికి వేతనాల క్రింద 9 కోట్ల 21 లక్షలు, కాంపోనెంట్స్ క్రింద 46 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1,56,828 మంది మహిళలతో 14,838 స్వయం సహాయక సంఘాలు, 562 గ్రామ సమాఖ్మలు, 17 మండల సమాఖ్యలు పనిచేస్తున్నాయని తెలిపారు. గత సంవత్సరం 386 కోట్ల 50 లక్షల గాను 400 కోట్ల 48 లక్షల ఋణాల మంజూరుతో 104 శాతం సాధించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెలా 84,149 మందికి ఆసరా పెన్షన్ల కింద 20 కోట్ల 24 లక్షలు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి, వారి జీవనోపాధి పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం క్రింద కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం క్రింద ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలో లబ్దిదారులు కోరుకున్న రంగాలలో వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లు గ్రౌండింగ్ చేపట్టడం జరిగిందని, అలాగే అసెంబ్లీ నియోజక వర్గానికి 100 దళిత బంధు యూనిట్ల మంజూరులో భాగంగా 337 కుటుంబాలను గుర్తించినట్లు, త్వరలోనే వారికి కూడా దళితబంధు లబ్ది చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి.యాక్షన్ ప్లాన్ క్రింద 80 శాతం సబ్సిడీపై లక్ష రూపాయల వరకు, 70 శాతం సబ్సిడీ క్రింద 2 లక్షల రూపాయల వరకు, 60 శాతం సబ్సిడీతో 2 లక్షలకు పైగా బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి. సంక్షేమం క్రింద చదువుకున్న నిరుద్యోగులలో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి విద్యార్థులు నాణ్యమైన బోధన పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం కింద 12 అంశాలు టాయ్లెట్స్, విద్యుత్, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్న్ చాకో బోర్డులు, కాంపౌండ్ గోడలు, కిచెన్ షెడ్స్, దెబ్బతిన గదులలో కొత్త గదులు, డిజిటల్ ఎడ్యుకేషన్, మేజర్ మైనర్ రిపేర్లు, తదితర పనుల క్రింద జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలకు గాను మొదటి విడుత కింద 251 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయంతో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ ఆడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీమతి సునంద. ఎస్.సి. కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్యాంసుందర్, జిల్లా విద్యా శాఖ అధికారి నర్సింహ్మ పాల్గొన్నారు.

Share This Post